శివరాత్రి రోజున తూర్పు గోదావరి జిల్లాలో విషాదం. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. తొలుత తిరుమల శెట్టి పవన్ (17), పడాల దుర్గాప్రసాద్ ( 19 ), పడాల సాయి ( 19) మృతదేహాలు లభ్యం కాగా… అనంతరం అనీసెట్టి పవన్ ( 19 ), గర్రె ఆకాష్ ( 19 ) ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. తాళ్లపూడి మండలం తాడిపూడి లో ఇసుక ర్యాంప్ వద్ద స్నానానికి దిగి గల్లంతు అయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకునీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. శివరాత్రి నేపథ్యంలో ఉదయం గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయిన తాడిపూడి కి చెందారు యువకులు. వీరంతా విద్యార్థులు, పిల్లల మృతితో శోకసంద్రంలోకి కుటుంబ సభ్యులు వెళ్లారు. తాడిపూడి లో ఒకే వీధికి చెందిన వీరి మరణం తో గ్రామంలో పండగ నాడు విషాదఛాయలు అలుముకున్నాయి.