ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన నాటి నుంచి 11వ రోజుకు సహాయక చర్యలు చేరుకున్నాయి. తాజాగా GPR సాంకేతిక పరికరం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
టన్నెల్‌లోని నీరు, బురద, రాళ్ళను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. అంతేకాకుండా టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తున్నారు. అయినప్పటికీ కనిపించకుండా పోయిన ఆ 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలీయరాలేదు. రాడార్ టెక్నాలజీ సాయంతో మట్టి దిబ్బల కింద మృతదేహాలను అధికారులు గుర్తించగా.. వారిని బయటకు వెలికి తీసేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
11వ రోజుకు చేరుకున్న SLBC టన్నెల్ సహాయక చర్యల ఆపరేషన్స్
GPR సాంకేతిక పరికరం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్
నీరు, బురద, రాళ్ళను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది
టన్నెల్ బోరింగ్ మెషీన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తున్న సిబ్బంది
ఇంకా తెలియని 8 మంది కార్మికుల ఆచూకీ pic.twitter.com/6mJCS75XxY
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025