రెడ్ బుక్ పై లోకేష్ కీలక వ్యాఖ్యలు..!

-

EVM అయినా బ్యాలెట్ అయిన గెలుపు కూటమిదే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. 9 నెలల్లో పార్టీని అధికారం లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది. ఇప్పుడు 9 నెలల్లో పాలనలో విజయం సాధించారు చంద్రబాబు. భారీ మెజారిటీతో గెలిస్తే నే గెలుపు అని నేను ఆనాడే చెప్పాను. ఇంకో ఇద్దరు నాయకులు మండలికి వస్తున్నారు. గెలుపు కోసం పని చేసిన ఎమ్మెల్యేలు నాయకులు.. ప్రాణ సమానమైన కార్యకర్తలుకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్.

ఇక పులివెందుల ఎమ్మెల్యే వన్ డే ఎమ్మెల్యే. డిపాజిట్ రాదని కనీసం పోటీ పెట్టలేదు. గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. గత ప్రభుత్వంలో అమరావతి కి అడ్డంగా పడుకుని పనులు ఆపేశారు. ఇక రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ అయ్యింది. ఎవరిని కూడా వదిలేస్తాం అనే ఆలోచన వద్దు అని హెచ్చరించారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news