ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌పై అవినీతి ఆరోపణలు.. ఉద్యోగి సస్పెండ్ (వీడియో)

-

వీసీ సజ్జన్నార్‌పై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తిని తొలగించారంటూ వస్తున్న వార్తలపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది.సదరు ఉద్యోగిని జాబ్ నుంచి తొలగించడానికి గల అసలు కారణాన్ని ఆర్టీసీ వివరించింది.దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.

‘ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు రాజేంద‌ర్. హుస్నాబాద్ డిపోలో ఆర్టీసీ కానిస్టేబుల్‌గా గతంలో విధులు నిర్వహించేవాడు. 2022లో ఒక మ‌హిళా ప్ర‌యాణికురాలిని రాజేంద‌ర్ లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు. క‌రీంన‌గ‌ర్ నుంచి సిరిసిల్ల‌కు ఆమె బ‌స్సులో ప్ర‌యాణిస్తోన్న స‌మ‌యంలో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు.

తీవ్ర ఇబ్బందికి గురైన ఆమె ఈ విష‌యాన్ని త‌న భ‌ర్త‌కు ఫోన్‌లో తెలియజేశారు.సిరిసిల్ల పాత బ‌స్టాండ్‌కు భ‌ర్త చేరుకుని రాజేంద‌ర్‌ను తీవ్రంగా కొట్టారు.ఆర్టీసీ కానిస్టేబుల్ రాజేంద‌ర్‌ బాధ్య‌తాయుత వృత్తిలో ఉండి..మ‌హిళా ప్ర‌యాణికులిని లైంగిక వేధింపుల‌కు గురిచేయ‌డంతో పోలీస్ కేసు ఆధారంగా అత‌డిని స‌ర్వీస్ నుంచి రిమూవ్ చేసింది.

గ‌తంలోనూ రాజేంద‌ర్ విధుల్లో తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ‌హించాడు, అవినీతికి పాల్ప‌డ్డాడు.కామారెడ్డి డిపోలో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు డిపోలో డీజిల్ దొంగ‌త‌నం చేశాడు.త‌న భార్య‌ పేరుతో ఆర్టీసీ ఉద్యోగుల‌ను బెదిరించి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎల్ఐసీ పాల‌సీలు చేయించాడు. ఇలా అనేక ఘ‌ట‌న‌ల్లో అత‌డికి 20 సార్లు ప‌నిష్‌మెంట్లు ఇచ్చిన ఆర్టీసీ..అందులో 4 సార్లు స‌ర్వీస్ నుంచి అధికారులు రిమూవ్ చేశారు’ అని స్పష్టంచేశారు.

https://twitter.com/TeluguScribe/status/1899442546159362471

 

Read more RELATED
Recommended to you

Latest news