గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపేందుకు నేడు సభను నిర్వహిస్తుండగా.. అది కాస్త బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గవర్నర్ చేత 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అధికార పార్టీ మీద విరుచకపడ్డారు. దీనికి గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందోనని అన్నారు.
దీనికి కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. జగదీశ్ రెడ్డి మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో సహనం కోల్పోయిన ఆయన దళిత స్పీకర్ అని కూడా గడ్డం ప్రసాద్ కుమార్‌పై గరంగరం అయ్యారు.‘ఈ సభ మన అందరిది.అందరికీ సమాన హక్కులు ఉన్నాయి.మా అందరి తరఫున పెద్దమనిషిగా మీరు కూర్చున్నారే తప్ప..ఈ సభ మీ సొంతం కూడా కాదు’ అంటూ స్పీకర్‌పై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో సహనం కోల్పోయి దళిత స్పీకర్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
ఈ సభ మన అందరిది. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి.
మా అందరి తరఫున పెద్దమనిషిగా మీరు కూర్చున్నారే తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ దళిత స్పీకర్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
– ఎమ్మెల్యే జగదీశ్… pic.twitter.com/EIwfBkWvkN
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 13, 2025