కేసీఆర్ అందుకే సభకు రాకుండా మొహం చాటేశారు : సీఎం రేవంత్

-

బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులను ఎందుకు విస్మరించిందని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు మరిచిందని ఆయన ప్రశ్నించారు.

పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తాను అడిగేవాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం విస్మరించిన వాటిని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news