గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్ష సభ్యులకు సమాధానాలు ఇవ్వగా.. ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు.
బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గవర్నర్ పట్ల అసహ్యకరమైన భాష ఉపయోగించి కించపరచారని సీఎం రేవంత్ అన్నారు. ఇలాంటి సంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టంచేశారు. ప్రతిపక్షం ఇలానే వ్యవహరిస్తే శాసనసభలో గుండుసున్నా అవుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాగా మారిందని సీఎం ఎద్దేవాచేశారు.