మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు ప్రాణహాని ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అందుకే ఆయన పోలీసుల పహార మధ్యలో తిరుగుతున్నారని వెల్లడించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు తన కుటుంబ సభ్యులతోనే ప్రాణహాని ఉందని బాంబ్ పేల్చారు.
ఇక మొన్న గవర్నర్ ప్రసంగాన్ని కొందరు గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని విమర్శిస్తున్నారని.. అది అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడమే అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని,వాటినే గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని సీఎం రేవంత్ స్పష్టంచేశారు.గత బీఆర్ఎస్ సర్కార్ మహిళా గవర్నర్‌ను అవహేళన చేసిందని, 2022 బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగించిందని గుర్తుచేశారు.