పక్క పొలంపై కన్నేసి.. గుట్టుగా రైతును హతమార్చిన మరో కౌలు రైతు

-

తన పొలంలో పంట సరిగా పండటం లేదని, పక్క పొలంపై కన్నేసిన ఓ కౌలు రైతు.. ఏకంగా అన్నదాతను హతమార్చాడు.ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పీక్యాతండాలో కౌలురైతు బానోతు రామోజీ(59) 6 ఎకరాల భూమిని రూ.75 వేలకు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. తన బంధువైన మరో కౌలు రైతు బానోతు రవి కూడా అతని పక్కనే 6 ఎకరాల భూమిని రూ.1.25 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు.


తాను కౌలుకు తీసుకున్న పొలంలో రాళ్లు ఉండటంతో పంట సరిగా పడటం లేదని భావించిన రవి..పక్కనున్న రామోజీ కౌలు భూమిపై కన్నేశాడు. దీంతో పలుమార్లు ఉద్దేశపూర్వకంగానే గొడవలు పెట్టుకున్నాడు.. గతనెల 12న రామోజీ నీళ్ల డబ్బాను చెట్టు కిందపెట్టి చేనులో పని చేస్తుండగా, ఇది గమనించిన రవి ఆ డబ్బాలో పురుగుమందు కలిపాడు.ఇది తెలియని రామోజీ ఆ నీళ్లను తాగాడు. తర్వాత మందు కలిపిన వాసన రావటంతో వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పాడు.అస్వస్థతకు గురైన రామోజీని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చెపించగా, నెల రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. విచారణ చేపట్టిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు రవిని విచారించగా నీళ్లల్లో అతడే పురుగు మందు కలిపినట్లు ఒప్పుకున్నాడు.దీంతో రవిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news