సాధారణంగా అధికార పార్టీని ప్రతిపక్ష సభ్యులు వేడుకుంటుంటారు. తమ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని, నిధులు కేటాయించాలని కోరడం కామన్. కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాకు ఇది చేయండి.. అది చేయండి.. అని అసెంబ్లీలో వేడుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మిర్యాలగూడ నియోజకవర్గంలో కరెంటు సమస్య అధికంగా ఉందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కరెంటు అధికారులతో మాట్లాడి కరెంటు సమస్య లేకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అసెంబ్లీలో స్పీకర్ ద్వారా సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేనే కరెంట్ సమస్యపై ప్రశ్నించారని.. అంటే రాష్ట్రంలో కరెంట్ సమస్య ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు.