నేను కూడా మంత్రి రేసులో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్

-

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా? అని ప్రభుత్వంలోని సీనియర్లు, జూనియర్లు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి విస్తరణలో ఎలాగైనా అవకాశం దక్కించుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సామాజిక వర్గం కోటాలో దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంత్రి పదవి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ తొలిసారి స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు లంబాడిలకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటి వరకు మా సామాజిక వర్గం నుంచి క్యాబినెట్‌లో లేకుండా లేరు.కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్‌లో మావాళ్ళు లేరు అనే అసంతృప్తితో ప్రజలు ఉన్నారు.

కేసీఆర్ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం దక్కింది.మా సామాజిక వర్గానికి కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదు. అయినా కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారు. మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. నాకు డిప్యూటీ స్పీకర్,మా వాళ్లకు ఇంకో ఏదో పదవి ఇస్తే కాదు. కేబినెట్‌లో బెర్త్ కావాలని డిమాండ్ ఉంది’ అని బాలునాయక్ స్పష్టంచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news