బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు దయ్యాయి.అందులో టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం ఉన్నట్లు సమాచారం.
తాజాగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ తెలుగు హీరోయిన నిధి అగర్వాల్ నెటిజన్లకు దొరికిపోయింది. దీంతో ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వీడియోను కొందరు నెటిజన్లు నేరుగా ఆర్టీసీ ఎండీ వీజీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్నారు.JeetWin అనే బెట్టింగ్ యాప్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. తమ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ను నెటిజన్లు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా ఝళిపిస్తున్న నైపథ్యంలో తెరపైకి మరో హీరోయిన్
JeetWin అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్.. తనపై చర్యలు తీసుకోవాలని @SajjanarVC గారిని కోరుతున్న… https://t.co/1y4xitlUuj pic.twitter.com/ZZY75flc31
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025