థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి తీవ్ర స్థాయిలో కంపించింది. భూకంపం దాటికి పెద్ద పెద్ద బిల్డింగులు సైతం పేక మేడల్లా కూలిపోయాయి. రిక్టర్ స్కేలు మీద భూకంప తీవ్రతను గుర్తించారు. బ్యాంకాక్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదు అయ్యింది.
ఇక మయన్మార్‌లో భూకంప కేంద్రాన్ని జర్మనీ సంస్థ గుర్తించింది. అక్కడ 7.7 తీవ్రత నమోదు అయినట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించడంతో జనాలు భయంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న భారీ భవనాలు సైతం ఒక్కసారిగా నెలమట్టంం అయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మరణాలు, ఆస్తినష్టానికి సంభవించిన వివరాలు తెలియాల్సి ఉంది.