Ishan Kishan’s bizarre dismissal: ఐపీఎల్ 2025 నేపథ్యంలో ఇషాన్ కిషన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో SRH బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔట్ విషయంలో వివాదం చెలరేగింది. బ్యాట్‌కు బంతి తగలకుండానే కిషన్ ఔట్‌గా వెళ్లాడు. బౌలర్ దీపక్ చాహర్, ప్లేయర్లు ఎటువంటి అప్పీల్ లేకుండానే ఔట్‌గా భావించి పెవిలియన్ చేరాడు.

దీంతో సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో ఇషాన్ ముంబై తరఫున ఆడుతున్నాడా అని నెటిజన్లు సోషల్ మీడియా లో ప్రశ్నించారు. కాగా హైదరాబాద్ గడ్డపై సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవి చూసింది. IPL-2025లో ఈ రోజు ఉప్పల్ వేదికగా MIతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘోర పరాజయం చెందింది.
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న MI.. నిర్ణీత 20 ఓవర్లలో SRHని 143 పరుగులకే కట్టడి చేసింది. ఛేజింగ్‌లో 3 వికెట్లు కోల్పోయిన ముంబై అలవోకగా టార్గెట్‌ని ఫినిష్ చేసింది. MI బ్యాటర్లు రోహిత్, సూర్య ధాటికి 15.4 ఓవర్లోనే మ్యాచ్ ముగిసింది. దింతో హైదరాబాద్ గడ్డపై సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవి చూసింది.