జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహింతంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేంద్ర కేబినెట్ ఈ విషయంపై సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషనర్ కార్యాలయం నుంచి అధికారులను తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ పౌరులకు దేశంలోకి అనుమతి నిరాకరించింది. సింధు జలాలపై ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఇదిలాఉండగా, ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి డెలివరీ బాయ్ కేక్ తీసుకెళ్తున్నట్లు దృశ్యాలు వైరల్ అయ్యాయి. పాక్ ఎంబసీ అధికారులు సెలబ్రేషన్స్ చేసుకున్నారని మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. సదరు డెలివరీ బాయ్‌ను మీడియా అడ్డగించి పలు ప్రశ్నలు సంధించినా అతని నుంచి సమాధానం కరువైంది.
ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో సెలబ్రేషన్స్
పాక్ హైకమిషన్ కార్యాలయం లోకి కేక్ డెలివరీ.
పాక్ ఎంబసీ అధికారులు సెలబ్రేషన్స్ చేసుకున్నారని అనుమానం.
కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్. pic.twitter.com/Dv0PkQU8X1
— ChotaNews App (@ChotaNewsApp) April 24, 2025