జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహింతంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏపీకి చెందిన పలువురు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ టెకీ సైతం ఉన్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న మధుసూదన్ సైతం టెర్రిరిస్టుల కాల్పుల్లో మరణించాడు.
అతని బాడీలో 40కు పైగా బుల్లెట్లు లభించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, నెల్లూరు జిల్లా కావలిలో స్వగృహానికి మధుసూదన్ భౌతికకాయం చేరుకున్నది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు కావలి ప్రజలు పెద్దఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో మధుసూదన్ ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.