జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గురువారం ఉదయం నివాళ్లు అర్పించారు. కాగా, తెలంగాణకు చెందని ఐబీ అధికారి పహెల్గాం ఉగ్రదాడిలో మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారితో పాటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు సైతం నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.