AP DGP Harish Kumar Gupta: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారికి బిగ్ షాక్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా. కేంద్ర నిఘా సంస్థల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్స్ గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలు చేయలేదన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.