మాజీ ENC హరిరామ్ పై సస్పెన్షన్ వేటు

-

మాజీ ENC హరిరామ్ కి ఊహించని షాక్ తగిలింది. మాజీ ENC హరిరామ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీబీ కేసులో రిమాండ్ లో ఉన్నందున హరిరామ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ అరెస్ట్ అయ్యాడు.

Hariram suspended as he is on remand in CB case
Hariram suspended as he is on remand in CB case

హరిరామ్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. గజ్వేల్‌లో భారీగా చట్టవిరుద్ధమైన ఆస్తుల గుర్తించారు. ENC హరిరామ్‌, అతని బంధువుల ఇళ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ నేతలు రైతులకు ఉపయోగపడుతుందని పేర్కొంటుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కేసీఆర్ కుటుంబం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని పేర్కొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news