రూ.300 కోట్ల కేసు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు

-

ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు అయ్యింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేశారు ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌.

Case registered against popular YouTuber and world traveler Anvesh

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా తెలుగు యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో.. ప్రపంచయాత్రికుడు అన్వేష్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ యాత్ర చేయకుండా ఈ తెలుగు యూట్యూబ్ లో పైన పడి వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు అతనిపైనే తెలంగాణ పోలీసు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news