మొన్న బొద్దింక.. నేడు జెర్రి.. ఏపీలో ప్రభుత్వ గురుకుల వసతి గృహాలు అద్వానంగా మారాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్ధినులు.

ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్ధినులు. టిఫిన్ తిని అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ క్వాలిటీ ఫుడ్ అంటే అందరూ వెక్కిరించారు.. ఇప్పుడేమైంది.. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో బొద్దింకలు.. జెర్రీలు వస్తున్నాయని పేర్కొన్నారు.
గతంలో చిన్న విషయం జరిగినా స్టేట్ అంతా చూసేది.. శ్రీకాళహస్తిలో రెండోసారి విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ జరిగిందన్నారు బియ్యపు మధుసూధన్ రెడ్డి. అయ్యా.. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్..వైసీపీ వాళ్లపై కేసులు పెట్టడంలో కాదు పోటీ పడేది.. అభివృద్ధిలో పోటీపడండి అని చురకలు అంటించారు.
మొన్న బొద్దింక.. నేడు జెర్రి
ఏపీలో అద్వానంగా మారిన ప్రభుత్వ గురుకుల వసతి గృహాలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు
ఉప్మాలో జెర్రి కనిపించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులు
టిఫిన్… https://t.co/LvZovpcsG9 pic.twitter.com/zMaO9XB6w9
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025