కన్నప్ప సినిమాలో రొమాంటిక్ సీన్స్.. స్పందించిన హీరోయిన్….!

-

 

కన్నప్ప సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ హీరోలుగా నటించగా… ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు మరికొంతమంది ప్రముఖ సినీ నటీమణులు కీలక పాత్రలను పోషించారు. కాగా, మొదటిసారిగా కన్నప్ప సినిమా గురించి హీరోయిన్ ప్రీతి ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కన్నప్ప సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎక్కడ కూడా కనిపించలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటిసారిగా స్పందిస్తూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. జీవితంలో కొన్నిసార్లు కొన్ని అనుభవాలను చెప్పడానికి మాటలు రావు. శారీరకంగానూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. కన్నప్ప సినిమా కోసం నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ పనిచేశాను. మొత్తానికి నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రీతి ముకుందన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రీతి ముకుందన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రీతి ముకుందన్ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమా షూటింగ్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news