‘మెగా 157’ లీక్స్ నేపథ్యంలో.. నిర్మాణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయంపై సీరియస్ అయింది నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్.

అనధికారికంగా షూటింగ్ రికార్డు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.