టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన విలన్ ఫిష్ వెంకట్ మొన్న రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. కిడ్నీలు, లివర్ పూర్తిగా చెడిపోవడంతో…. ఫిష్ వెంకట్ మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ఆయన అంతక్రియలు నిన్న పూర్తయ్యాయి. అయితే సరైన సమయంలో ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సహాయం అందితే కచ్చితంగా ఫిష్ వెంకట్ బతికి ఉండేవాడని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది.
పిచ్చి వెంకట్ అనారోగ్యం నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ సహాయం చేశారట. ఫిష్ వెంకట్ కోసం దాదాపు 18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారట గులాబీ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.