కన్నడ హీరో దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉండలేకపోతున్నా.. నాకు విషమివ్వండి అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. జైలు గదిలోకి ఎండ రావడం లేదు.. గదిలో దుస్తుల దుర్వాసన వస్తుందని తెలిపారు. రూంలో మొత్తం ఫంగస్ పట్టింది.. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉందని వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను.. నాకు విషమివ్వండని అంటూ న్యాయమూర్తి ముందు వాపోయారు కన్నడ హీరో దర్శన్. దీంతో కన్నడ హీరో దర్శన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా..రేణుక స్వామి హత్య కేసులో జైలుకు వెళ్లారు కన్నడ హీరో దర్శన్. గత ఏడాది కాలంగా జైలులోనే ఉంటున్నారు.