హైదరాబాద్ లో విచిత్రమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్మశానంలోనే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ బేగంపేట పరిధిలో స్మశాన వాటికను ఓ మహిళ వ్యభిచార గృహంగా పూర్తిగా మార్చేసింది. శ్యాం లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ గదిని వ్యభిచార గృహంగా మార్చేసింది. నిర్వాహకులు మాధవి యువతులను తీసుకువచ్చి విటులను ఆహ్వానించి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

మాధవితో పాటు మరో యువతి, విటుడిని బేగంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విటుడిని కాంట్రాక్టర్ గా గుర్తించారు. స్మశానంలో ఇలాంటి వికృత చేష్టలు చేయడం ఏంటని పోలీసులు ఫైర్ అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకొని వారిని పట్టుకున్నారు. చాలా రోజుల నుంచి స్మశాన వాటికలో మాధవి అనే మహిళ ఇలాంటి పనులను చేస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయం పైన పోలీసులు మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.