తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ గా 7,754 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, దిల్షుక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ పేర్కొంది. జనాల రద్దీని బట్టి అక్టోబర్ 5, 6 తేదీలలో ఈ బస్సులను నడపనున్నారు.

అయితే ఈ నెల 20, 27, 28, 29, 30 తేదీలతో పాటు అక్టోబర్ 1,5, 6 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో బతుకమ్మను పువ్వులతో అలంకరించి గౌరమ్మను తయారుచేసి పెడతారు. పువ్వులతో పండగ చేసుకునే సాంప్రదాయం తెలంగాణలోనే ఉంది. ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే బస్టాండ్ లలో ప్రజల రద్దీ అధికంగా పెరుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.