బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ (52) మరణించారు. ఇతను అస్సాంకు చెందిన వ్యక్తి. సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి తన ప్రాణాలను కోల్పోయారు. నార్త్ – ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఈవెంట్ లో ఈనెల 20, 21వ తేదీన ప్రదర్శన ఇచ్చేందుకు జుబీన్ గార్గ్ సింగపూర్ కు వెళ్లారు. ఇమ్రాన్ హష్మీ – కంగనా నటించిన గ్యాంగ్ స్టార్ సినిమాలోని “యా అలీ” పాటతో జుబీన్ గార్గ్ పాపులర్ అయ్యారు.

అనంతరం బాలీవుడ్ లో అనేక పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తన పాటలతో సినీ పరిశ్రమను అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జుబీన్ గార్గ్ మరణంతో సినీ పరిశ్రమ కన్నీటి పర్యాంతం అవుతుంది. తన కుటుంబ సభ్యులు, సినీ నటీనటులు, అభిమానులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జుబిన్ గార్గ్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.