కార్తీక అమావాస్య 2025: తిథి కాలం, పూజా ముహూర్తం ఇదే

-

కార్తీక మాసం.. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అందరికి తెలిసిందే మరి ఈ మాసంలో వచ్చే అమావాస్యకు హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అని మీకు తెలుసా? ఈ రోజున చేసే స్నానం, దానం మరియు పితృ దేవతలకు పెట్టే తర్పణాలు అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈ రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని ప్రతీతి. మరి 2025 సంవత్సరంలో ఈ పవిత్ర కార్తీక అమావాస్య ఎప్పుడు వస్తుంది? శుభ ముహూర్తాలు ఏంటో తెలుసుకుందాం.

2025 సంవత్సరంలో హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక అమావాస్య చాలా ముఖ్యమైన పండుగ. ఈ అమావాస్య నాడు పితృదేవతలకు సంబంధించిన కార్యాలు (తర్పణాలు, పిండ ప్రధానం) నిర్వహించడం వలన, వారికి శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున లక్ష్మీ దేవి పూజ, కాళీ మాత పూజ చేయడం కూడా అత్యంత శుభప్రదం. 2025 నవంబర్ 19,20 తేదీలలోబుధవారం,గురువారం నాడు కార్తీక అమావాస్య వస్తుంది. తిథి కాలం విషయానికి వస్తే, అమావాస్య తిథి నవంబర్ 19 వ తేదీన సాయంత్రం ప్రారంభమై, నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది.

Karthika Amavasya 2025: Full Tithi Schedule and Best Time for Puja
Karthika Amavasya 2025: Full Tithi Schedule and Best Time for Puja

ముఖ్యంగా అమావాస్య తిథి నవంబర్ 19 2025న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఇది నవంబర్ 20, 2025న మధ్యాహ్నం 1:40 గంటలకు ముగుస్తుంది. ఈ తిథి కాలంలోనే పితృ కార్యాలు మరియు నదీ స్నానాలు ఆచరించడం శ్రేయస్కరం. దీపావళి లక్ష్మీ పూజ ముహూర్తం సాధారణంగా ప్రదోష కాలంలో (సాయంత్రం) ఉంటుంది, ఇది ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికి ఉత్తమ సమయం. 2025లో లక్ష్మీ పూజ కోసం శుభ ముహూర్తం నవంబర్ 19, 2025 సాయంత్రం 06:05 నుండి రాత్రి 08:06 గంటల లోపు  ఈ సమయంలో స్థిర లగ్నంలో పూజించడం వలన అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో దీపాలు వెలిగించి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.

2025 కార్తీక అమావాస్య అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది పితృ రుణం తీర్చుకోవడానికి, మరియు దేవతల ఆశీస్సులు పొందడానికి లభించిన ఒక పవిత్ర అవకాశం. ఈ శుభ దినాన మనస్ఫూర్తిగా పూజలు దానధర్మాలు చేయడం వలన మన జీవితంలో అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news