తక్కువ సమయంలోనే సాగు.. ఎక్కువ రాబడినిచ్చే బీర సాగు గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

-

రైతులు చాలా రకాల పంటలను పండిస్తారు. కూరగాయలు, వరి ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఎక్కువ ఉన్న బీరకాయ సాగు ఎలా చేయాలి అనేదాని గురించి ఈరోజు తెలుసుకుందాం. బీర పంట త్వరగా చేతికి వచ్చేస్తుంది. అలానే సాగు చేయడం కూడా సులభం.

 

తక్కువ సమయంలో సాగు.. ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలలో బీర కూడా ఒకటి. అయితే బీర సాగు ఎలా చేయాలి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా బీర సాగుకు సంబంధించి ముఖ్యమైన విషయాలు చూద్దాం.

యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి వస్తుంది. విత్తనాలు వేసిన మూడు వారాలకే కాతకు రావడం యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత సులభంగా బీరకాయలుని ట్రెంపి మార్కెట్ లోకి తీసుకెళ్ళి అమ్మవచ్చు.

పైగా బీర పంట వేయడం వల్ల మరొక ప్లస్ ఏంటంటే ఎక్కువ కూలీలు కూడా అవసరం లేదు. ఒక వ్యక్తి ఒక రోజులో క్వింటాళ్ల వరకు బీరకాయలు తెంపచ్చు. బాగా ధర పలికితే లాభాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఈ మధ్యకాలంలో హైబ్రీడ్ విత్తనాల ఉత్పత్తి అయ్యే బీరకాయల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ధరలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండవు ఒక్కోసారి తగ్గుతాయి. ఒకసారి పెరుగుతాయి.

బీర పంట బాగుండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:

బీర తీగ జాతి కూరగాయల పంట. కాబట్టి తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తెగులు రాకుండా ముందు నుండి జాగ్రత్త పడాలి. తగిన మందును స్ప్రే చేస్తే ఈ సమస్య ఉండదు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే దిగుబడి మరింత బాగుంటుంది.

బీర సాగు లో తెగుళ్ళు:

తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఉంటాయి. రకాలు కూడా ఉంటాయి. బూజు తెగులు. బూడిద తెగులు, వేరు కుళ్లు తెగులు, పక్షి కన్ను తెగులు వంటివి ఉంటాయి. ఇటువంటి వాటి నుంచి మీ పంటని కాపాడుకోవాలంటే ముందు నుండి కూడా అధికారులను సంప్రదించి మందులను స్ప్రే చేస్తూ ఉండాలి.

బీర సాగు విత్తే పద్ధతి:

నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవడానికి రెండు మీటర్ల దూరంలో కాలవలు ఏర్పాటు చేయాలి. అన్నిరకాల పాదులకు 3 విత్తనాలను 1.2 సెంటీ మీటర్ల లోతులో విత్తుకోవాలి.

బీర సాగు లో నీటి యాజమాన్యం:

పాదు చుట్టూ మూడు నుండి ఐదు సెంటీమీటర్ల మందాన మట్టి ఎండి ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వారానికొకసారి నీటి తడులు ఇస్తే బాగా కాయలు కాస్తాయి. పైగా నీరు ఎక్కువగా పాదుల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

బీర సాగు కోసం ఎరువులు:

విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. అలానే నత్రజనిని 32–40 కిలోలను సమానంగా చేసి విత్తిన 25–30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. ఇలా బీర సాగు చేసేటప్పుడు వీటిని పాటించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version