బ్రకోలి సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

శీతాకాలంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో బ్రకోలి కూడా ఒకటి..ఈ బ్రకోలి చూడటానికి కాలీ ఫ్లవర్ లాగే ఉంది, పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. భారతదేశంలో బ్రకోలిని అధికంగా అత్యల్ప ఉష్ణోగ్రతలున్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నీలగిరికొండలు, చదును ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ బ్రకోలి పంటకు అల్ప ఉష్ణోగ్రతలు అయిన 18-25 డిగ్రీ సెం.గ్రే. వరకూ అవసరం. దక్షిణ భారతదేశంలో బ్రకోలి చాలా తక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం రైతులకు సరైన అవగాహన లేకపోవడమే. బ్రకోలి పంటను షేడేటలో బయట పొలాల్లో కూడా పండించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు..

 

 

బ్రకోలి మూడు నెలల పంట. దీనికి 18-25 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రతలు చాలా అవసరం. 30 డిగ్రీ సెం.గ్రే. ఉష్ణోగ్రతలు అవసరం.. అంతకు మించి దాటితే పువ్వు రాదు. కావున శీతాకాలంలో డిసెంబర్, జనవరి నెలలు ఆంధ్రప్రదేశ్ కు మంచివి..ఈ పంట అన్ని నెలలకు అనుకూలమే..మురుగునీరు ఇంకిపోవు వసతిగల సారవంతమైన, ఎర్రనేలలు మిక్కిలి అనుకూలం.. 85-90 రోజులు సమయంలోనే వస్తుంది. ఈ పువ్వు బరువు 300-400 గ్రా. కలిగి హెక్టారుకు 150- 200 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది..

అయితే ఈ బ్రకోలి నారుమొక్కలు ప్రధాన పొలంలో నాటడానికి ఒకనెల ముందు విత్తనాలు ప్రోట్రేస్ కొబ్బరి పొట్టు వేసి నారును తయారు చేసుకోవాలి. నెల వయస్సు ఉన్న నారుమొక్కల్ని డిసెం బర్ మొదటి వారంలో ప్రధాన పొలంలో 50 సెం.మీ. మొక్కల మధ్య 30 సెం.మీ. వరుసల మధ్య దూర ఉండేలా నాటుకుంటే మంచిది.. పొలం తయారు చేసే ముందు ఎకరాకు 7.5 టన్నుల చివికిన పశువుల పేడను 4 కిలోల భాస్వరం, పొటా ష్ ను, 28 కిలోల నత్రజని నేలలో వేసి తయారు చేయాలి.చీడ పీడల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇక బ్రకోలి పువ్వులోని మొగ్గలు ఆకుప చ్చగా ఉండి పూర్తిగా విచ్చుకోకముందే పంటను ఉదయం కాని, సాయంత్రం 3 గంటల తర్వాత కానీ కోసుకోవాలి. కోసిన బ్రకోలి పువ్వు బయట ఉష్ణోగ్ర తలో 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండలేవు. ఫ్రీడ్జ్ లో పెట్టి నిల్వ చెయ్యడం మంచిది.. వీటి గురించి మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version