అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశం మీద పడుతుంది : ఆర్ధిక మంత్రి

-

2 లక్షలు వరకు టాక్స్ కట్టే అవకాశం లేకుండా వెసులుబాటు ఇచ్చాము. సర్వీస్ సెక్టార్ లో నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఇతర దేశాలు తరహాలో మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలి. నేను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో నివసించి అక్కడ నీటి కష్టాలు అనుభవించాను. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికి మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నాము. ఆత్మ నిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితి కి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.

విశాఖకు సమీపంలో ఫార్మా రంగం అభివృద్ది కి బల్క్ డ్రాగ్ పరిశ్రమలు విస్తృత పరిచాం. అమెరికా అధ్యక్షుడు నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. “అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక స్థితి మీద పడుతుంది. నూతన పద్ధతులు ద్వారా ఆదాయపను చెల్లింపు విధానం అనేది పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేయడం జరిగింది. మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గుతుంది అని ఆర్ధిక మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version