అరటి సాగులో అనువైన రకాలు..సాగు పద్దతులు..

-

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలలో ఇది కూడా ఒకటి..అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో, ఉత్పాదకతలో ముందు స్థానంలో ఉండగా తెలుగురాష్ట్రాల్లోని రైతులు కూడా ఎక్కువగా అరటి సాగు చేపడుతున్నారు.. అరటి ఉష్ణమండలపు పంట సరాసరి 25-30′ సెం.గ్రే. ఉష్ణోగ్రత అనుకూలం. సారవంతమైన తగినంత నీటి వసతి కలిగి నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం గల నేలల్లో సాగు చేపట్టవచ్చు..

ఈ అరటిలో అనువైన రకాలు 70 వరకు ఉన్నాయి. అందులో చాలా రకాలు ఉన్నాయి.వాటిలో ఎన్ని మంచి రకాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

అమృత పాణి: 13-14 నేలల్లో పంట వచ్చును.గెల 15-20 కేజీల బరువు ఉండి 8-10 హస్తాలతో 80-100 కాయలు కలిగి ఉండును.ఎక్కువ కాలం నిల్వ చేయడానికి పనికి రాదు.పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోవును.పనామా తెగులు ఈ రకం పై తీవ్రంగా వస్తుంది.ఆకు మచ్చ తెగులును తట్టుకోగలదు.

రోబోస్టా: 15-20 కేజీల బరువు 9-10 హస్తాలతో దాదాపు 125-130 కాయలు కల్గి ఉండును.11-12 నేలల్లో పంటకు వచ్చును. కాయలు కొంచెం పెద్దవి గా ఉండి వంకర తిరిగి ఉంటాయి.పండిన తర్వాత కూడా తొక్క ఆకు పచ్చ రంగులో ఉంటుంది..రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు.కాని వెర్రి తెగులు, ఆకు తెగులు ఆశిస్తాయి..

కర్పూర చక్కెర కేలి: భారత దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రాకనేదే దీని గెలలు పెద్దవిగా10-15 కేజీల బరువు ఉండును.గెలకు 10-12 హస్తలు ఉండును.12 నేలలలో పంట వచ్చును.పనామా తెగుళ్ళను, ఆకు మచ్చ తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది. తేలిక నేలల్లో వర్షా భావ పరిస్థితులలో సాగు చేయవచ్చు.

తెల్ల చెక్కెర కేళి: ఈ రకం ఉభయ గోదావరి, గుంటూరు,జిల్లాలో సాగులో ఉంది. ఆకులో అంచు పైకి తిరిగి ఉండడం ఈ రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీలు ఉంటుంది. ఒక గేలలో 5-6 హస్తాలతో 60-80 కాయలు కలిగి ఉండును.12 నేలలో పంట కోతకు వచ్చును.పనామా తెగులు తట్టుకుంటుంది.అధిక ఉష్ణోగ్రతా సారవంతం కలిగిన నెలలకు అనుకూలం కాదు.

బొంత: ఈ రకం 13 నేలకే వచ్చే పంట.గెల 12-15 కేజీల బరువుతో 5-6 హస్తలను దాదాపు 70-80 కాయలు కలిగి ఉండును.కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా ఉండి అంచులు బాగా కనిపించును.అన్ని ప్రాంతాలకు అనువైన రకం..పనామా తెగులును తట్టుకోలేదు.ఆకు మచ్చ తెగులును తట్టుకుంటుంది..

ఏనుగు బొంత: బొంత రకాన్ని మ్యుటేషన్ ద్వారా రూపొందించిన మేలైన రకం 13 నుంచి 14 నేలల లోపు కాపుకు వస్తుంది.గెల 15-20కేజీ ల బరువు 6-7 హస్తలతో 75-100 కాయలు కలిగి ఉండును.ఆకు మచ్చ మరియు పనామా తెగులును తట్టుకోలేదు.

గ్రేoడ్ నైన్: ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది.గెలల పరిమాణం సైతం ఎక్కువగా ఉంటుంది.12 నేలల పంట కాలం ఉన్న రకం 2.2-2.7 మీటర్లు ఎత్తు సగటు గెల బరువు 25-30 కేజీ లు ఉండును..ఈ రకాలను ఎక్కువగా మన రాష్ట్రాల్లో పండి

Read more RELATED
Recommended to you

Exit mobile version