మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క..!

-

మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి సీతక్క. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది. అందుకే కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారు. మీ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదని విషయం మహిళలందరికీ తెలుసు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మహిళలు అప్పుల పాలవుతున్నారు.. ఆగం అవుతున్నారని హరీష్ రావు ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నారు.

మహిళా సంక్షేమం పట్ల మీది దరిద్రమైన పాలన.. మీ పాలనలో మీ ఆడబిడ్డ కవిత ఒక్కరే ఎదిగారు. బతుకమ్మ వేడుకలు అయినా, బీసీ ఉద్యమం అయినా, మహిళా ఉద్యమమైనా కవితే హైజాక్ చేస్తారు. కవిత తప్ప ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అన్నది BRS లక్ష్యం. అందుకే లక్ష మంది తరలివచ్చి మహిళా సభను సక్సెస్ చేస్తే మీరు ఓర్వ లేకపోతున్నారు.మీరు ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు 3485 కోట్లు చెల్లించాల్సి ఉండగా..కేవలం 409 కోట్లు మాత్రమే చెల్లించారు. హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చివరి మూడేళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైస చెల్లించలేదు. మహిళలకు మూడేళ్లు గుండు సున్నా పెట్టిపోయారు. వేల కోట్ల వడ్డీలు చెల్లించకుండా మహిళలను మోసం చేశారు అని సీతక్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version