ముఖంపై ఏ ప్రదేశంలో మొటిమలు వస్తే.. శరీరంలో ఈ భాగాల్లో సమస్యలు ఉన్నట్లే

-

టీ కాఫీలు తాగినప్పుడు మనకు ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది.. టైమ్‌ పాస్‌కు కూడా కొంతమంది పదే పదే కాఫీ తాగుతుంటారు. ఇలాంటి అలవాటు ఆరోగ్యంపైనే కాదు.. చర్మంపై కూడా ప్రభావితం చూపుతుందని మీకు తెలుసా..? మీకు పింపుల్స్‌ ఎక్కువగా వస్తున్నాయంటే.. ముందు చేయాల్సిన పని.. కాఫీ, టీలు మానేయడం.. మీకు ఈ అలవాటు లేకపోయినా పింపుల్స్‌ వస్తే.. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తగ్గించి.. ఇప్పుడు చెప్పే కొన్ని టిప్స్‌ పాటిస్తే చాలు. !

ముల్తానీ మెత్తిని రాత్రి పడుకునే ముందు మోటిమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అప్లై చేయాలి. ఉదయం నిద్ర లేవగానే కడుక్కోవాలి. ఇలా చేస్తే రాత్రికి రాత్రే మొటిమలు తగ్గుతాయి.. వరుసగా వారం చేస్తే చాలు.. పూర్తిగా నయం అవుతాయి.

అలాగే టొమాటో రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మీరు మీ చేతులతో మీ ముఖంపై మొటిమలను గిల్లకూడదు.. ఇలా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అవి ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.

అలాగే మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు..ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే..ఆయిల్స్‌ ఫుడ్స్‌, వేయించిన ఆహారాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు తినకూడదు. దీంతోపాటు మీ ముఖంలో ఏ భాగంలో మొటిమలు ఎక్కువగా వస్తే.. శరీరంలో కొన్ని అవయవాల పనితీరు బాలేదని అర్థం.. దాన్ని బట్టి మీరు వాటికి తగిన ఆహారాలు, జాగ్రత్తలు తీసుకోవాలి..

పింపుల్స్‌ చెప్పే సంకేతాలు ఇవే..

  • ఫోర్‌ హెడ్‌ మీద పింపుల్స్‌ వస్తున్నాయంటే.. గుండె, బ్లాడర్‌లో సమస్య ఉన్నట్లు..అలాగే హెయిర్‌ శుభ్రంగా లేకపోయినా నుదిటిపైనే పింపుల్స్‌ వస్తాయి.
  • కళ్ల కింద పింపుల్స్‌ వస్తే.. కిడ్నీల ఆరోగ్యం బాలేదని అర్థం
  • రెండు కళ్ల మధ్యలో అంటే బొట్టు పెట్టుకునే చోట, కళ్లపక్కన మొటిమలు వస్తే.. లివర్‌ సమస్య ఉన్నట్లు.
  • బుగ్గలపైన మొటిమలు వస్తుంటే.. కడుపులో సమస్యలు ఉన్నట్లు
  • గడ్డానికి కాస్త పైన మొటిమలు వస్తుంటే..లంగ్స్‌లో సమస్య ఉన్నట్లు
  • దవడ మీద పింపుల్స్‌ వస్తుంటే.. హార్మోనియల్‌, గైనకాలిజియల్‌ సమస్యలు ఉన్నట్లు.
  • పెదవుల పక్కన మొటిమలు వస్తుంటే పెద్ద ప్రేగులో సమస్య ఉన్నట్లు
  • పెదవులు పైన ముక్కు కింద భాగంలో వస్తుంటే.. గుండెలో సమస్య ఉన్నట్లు..

Read more RELATED
Recommended to you

Exit mobile version