బిజినెస్ ఐడియా: వంట పాత్రలతో లక్షల్లో సంపాదిస్తున్న మహిళా…!

-

చాలామంది ఈ మధ్య వ్యాపారం పై మక్కువ చూపిస్తున్నారు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నార…? అయితే కచ్చితంగా మీరు ఈ మహిళ ప్రారంభించిన బిజినెస్ గురించి చూడాలి. కేరళకు చెందిన ఈ మహిళ వంట పాత్రల బిజినెస్ మొదలుపెట్టారు. కేవలం ఈమె వంట పాత్రలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే మరి ఆమె ఎలా వ్యాపారాన్ని మొదలు పెట్టారు..? ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టారు అని దాని గురించి చూద్దాం.

సాధారణ వంట పాత్రలు అమ్ముతూ మూడింతల రిటర్న్స్ ని ఈమె సాధిస్తోంది. పాతకాలపు సాంప్రదాయ వంట పాత్రలు అమ్ముతున్నారు. కేరళలోని కొచ్చిన్ కి చెందిన కావ్య పాత కాలపు వంట పాత్రలలో వండితే వంట రుచి బాగున్నట్లు గ్రహించారు. వంట పాత్ర మారిస్తే రుచి కూడా మారుతోందని ఆమె తెలుసుకుని వాళ్ళ అమ్మమ్మ వండే పాత్రలో వంట చేయడం మొదలు పెట్టారు. రుచి మారిందని గ్రహించి అప్పటి నుండి ఈమె ఆ సామాన్లను అమ్మడం మొదలు పెట్టారు.

2020 లో గ్రీన్ హెయిర్ లూమ్ ని ఈమె స్థాపించారు. అలాగే ఈ పాత్రలను ఏళ్ల తరబడి కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుందని ఇలాంటి పాత్రను ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని… 3.5 లక్షల పెట్టుబడితో ఈమె బిజినెస్ ని స్థాపించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఈ వెబ్సైట్ ద్వారా సామాన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఈమె మంచిగా రాబడిని పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version