సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్ లను వివరించిన శిఖా గోయల్..!

-

సైబర్ నేరగాళ్లు కొత్త స్కెచ్ లు వేస్తున్నారు. కొట్టేసిన విదేశీ డబ్బు ఆన్ లైన్ లో కాకుండా ఏటీఎంల నుంచి విత్ డ్రా చేయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేసారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. హైదరాబాద్ లోని మ్యూల్ అకౌంట్స్ లో డిపాజిట్ అయిన సైబర్ ఫ్రాడ్స్ క్యాష్ ను విత్ డ్రా చేసి మళ్ళీ సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తుంది గ్యాంగ్. ఈ విషయంపై తెలంగాణ సిఐడి డీజి శిఖా గోయల్ కీలక కామెంట్స్ చేసారు.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదిక ను విడుదల చేసిన డైరెక్టర్ శిఖా గోయల్.. ఈ సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల కోసం మూడు ఆపరేషన్స్ నిర్వహించాము. 18 నుండి 20% సైబర్ నేరాలు ఈ సంవత్సరం సైబర్ నేరాలు పెరిగాయి. ఈ సంవత్సరం 176 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇచ్చాము. సైబర్ నేరగాళ్ల అరెస్టులు కూడా గణనీయంగ పెరిగాయి. 1,057 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసాము. వీరు తెలంగాణలో 19 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ నిందితులు ఇన్వాల్వ్ అయిన కేసులు లక్షల్లో ఉన్నాయి. సైబర్ నేరాల దర్యాప్తు సమర్థవంతమైన టూల్స్ సైబర్ బ్యూరోతో ఉన్నాయి. ఈ సంవత్సరం 9800 ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయడం ద్వారా నేరగాళ్లు మొబైల్స్ పని చేయకుండా చేశాము. గత సంవత్సరం 181 IMEIనంబర్లను మాత్రమే గత సంవత్సరంలో బ్లాక్ చేసాం. యుఆర్ఎల్, వెబ్సైట్లను కూడా బ్లాక్ చేశాము. సైబర్ నేరాలపై అవగాహన కోసం, సందేహాలనువృత్తి కోసం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసాం అని శిఖా గోయల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version