రైతులకు మంచి బిజినెస్‌ ఐడియా..? ఇవి పండిస్తే లాభం ఎక్కువ

-

వ్యవసాయం అంటే కాస్త రిస్క్‌,కష్టంతో కూడుకున్న పని. కానీ లక్క్‌ బాగుండి లాభం వస్తే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కంటే ఎక్కువే సంపాదించవచ్చు. ఇప్పుడు బయట టమోటా రేట్లు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. దెబ్బకి ఈ ఏడు టమాట పంట వేసిన రైతుల సుడి తిరిగింది. అప్పులన్నీ తీరిపోయాయి. పత్తి, మిరప, మినుము అంటూ లాంగ్‌టర్మ్‌ పంటలు వేస్తే.. ఏం జరుగుతుందో చెప్పలేం. లాభం రావొచ్చు, నష్టం కూడా రావొచ్చు. నెలరోజుల్లో పంట చేతికి వచ్చేలా ఉండాలి..? అలాంటి వేస్తే రైతులకు బాగా లాభాలు పొందవచ్చు. అవే కూరగాయల వ్యాపారం.

వాణిజ్య పంటలు వేసి నష్టపోయిన రైతులకి ఇదొక ప్రత్యామ్నాయ వనరుగా చెప్పవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఈ వ్యాపారం వల్ల మంచి ఆదాయం సమకూరుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు వీటికి డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు కానీ కచ్చితంగా వ్యవసాయ భూమి ఉండాలి. ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఇప్పుడు వ్యవసాయం వైపు మెుగ్గుచూపుతున్నారు. అలాంటి వారు ఆర్గానిక్‌ కూరగాయలు పండిస్తే బాగా సంపాదించవచ్చు.

తక్కువ పెట్టుబడితో రసాయనాలు వినియోగించకుండా పండించే కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ రోజురోజుకు బాగా పెరుగుతోంది. మారుతున్న ప్రజల జీవనశైలితో పాటు మంచి ఆహార అలవాట్ల వైపు జనాలు మొగ్గుచూపుతున్నారు. ఇదే ఇప్పుడు యువ రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. రూ.20 వేలు పెట్టుబడితో కూరగాయల సాగును ప్రారంభిస్తే నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సహజసిద్ధమైన ఎరువుల వినియోగం రైతులకు ఖర్చులను తగ్గించటంతో పాటు దిగుబడిని పెంచుతుంది.

పైగా ఇలా పండించే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రైతులు వీటిని సమీపంలోని మార్కెట్లలో స్టాల్ ఏర్పాటు చేసుకుని కూడా విక్రయించవచ్చు. లేదంటే ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు. అంతేకాకుండా సమీపంలోని సూపర్ మార్కెట్లు, మాల్స్ వంటి చోట్ల ఉండే స్టోర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని ఉత్పత్తులను సరఫరా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఎక్కువ మంది కస్టమర్లకు ఉత్పత్తులను విక్రయిస్తూ తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించవచ్చు.

కూరగాయలు ఈరోజుల్లో ఎంత కల్తీ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం, పురుగుమందులు లేకుండా పండించేవి అంటే ఒక రూపాయి ఎక్కువైనా ప్రజలు కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర భూమి ఉంటే ఇలాంటి వాటిపై దృష్టిపెట్టి చూడండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version