బిజినెస్ ఐడియా: ఆయిల్ వ్యాపారంతో నెలకి యాభై వేలు సంపాదించచ్చు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా ఈ వ్యాపారం చేయడం వల్ల మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది.

ఈ రోజుల్లో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలకు వంట నూనె అంటే చుక్కలు కనబడుతున్నాయి. మీరు దీనిని వ్యాపారంగా మార్చుకుంటే మంచిది ఆదాయం పొందొచ్చు. మీరు ఈ బిజినెస్ ని పల్లెల్లో అయినా పట్నంలో అయినా ఎక్కడైనా ప్రారంభించొచ్చు.

గతంలో ఆయిల్ మిల్లు స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు పోర్టబుల్ మిషన్లు వచ్చాయి. దీనితో సులభంగా మీరు ఆయిల్ వ్యాపారం మొదలు పెట్టొచ్చు పైగా ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఈ వ్యాపారం ని మొదలు పెట్టడానికి వేరుశనగ, నువ్వులు వంటి ధాన్యాలు కావాలి. వీటి ద్వారా అతి తక్కువ సమయంలోనే నూనెను మీరు సులభంగా తీయొచ్చు.

ఆయిల్ చేయడానికి మిషన్ రెండు లక్షలు ఉంటుంది. మీరు దీనిని మొదలు పెట్టాలంటే లైసెన్స్ తో సహా కొన్ని ప్రభుత్వ పత్రాలను పొంది ఉండాలి. ఈ వ్యాపారం కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీరు అందించే ప్రోడక్ట్ ని బట్టే మీ యొక్క వ్యాపారం నడుస్తుంది. కాబట్టి మంచి నాణ్యత ని మెయింటైన్ చేయండి. ఈ వ్యాపారం ద్వారా మీరు నెలకి 20,000 రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version