2047 నాటికి తెలుగు వాళ్లు గొప్పగా ఉండాలన్నదే నా లక్ష్యం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జ్యూరిచ్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజు తాను ఇంజనీరింగ్ కాలేజీలు తేవడం వల్లనే మీలో చాలా మంది చదువుకున్నారు.2004లో గెలిచి ఉంటే.. తెలుగు జాతి ఎక్కడికో వెళ్లేది. 2024లో అధికారంలోకి వచ్చాం.. ఇంకా దశాబ్దాల పాటు టీడీపీ పాలిస్తుందని తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వేగంగా పెరుగుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు. తాను హైదరాబాద్ కు మైక్రోసాప్ట్ కంపెనీని తీసుకురావడం కోసం బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ కోసం 3 రోజుల సమయం పట్టింది. మూడు రోజుల తరువాత 10 నిమిషాలు మాట్లాడుతానని అపాయింట్ మెంట్ తీసుకున్నాను. దాదాపు 45 నిమిషాల పాటు బిల్ గేట్స్ కి వివరించారు. అతను కూడా ఏమనలేదు. హైదరాబాద్ కు మైక్రోసాప్ట్ కంపెనీ తీసుకురావాలని చెప్పగానే.. సహకరించారని తెలిపారు.