పండుగ అయినా.. శుభకార్యం అయినా.. బర్త్ డే అయినా.. బయటకు వెళ్లినా.. ఇలా ఏ సందర్భం అయినా సరే.. అనేక మంది కొత్త దుస్తులను ధరిస్తుంటారు. అందుకనే మన దేశంలో వస్త్ర దుకాణాల్లో ఎప్పుడు చూసినా భలే గిరాకీ ఉంటుంది. పండుగ సీజన్లలో ఇక రద్దీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయంలో వస్త్ర దుకాణాలు పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తాయి. అయితే వస్త్ర దుకాణం పెట్టాలనుకునే ఎవరైనా సరే.. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. చాలా తక్కువ పెట్టుబడితో ముందుగా చిన్న దుకాణంలోనూ వస్త్ర వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఏదైనా ఒక చిన్న రూం అద్దెకు తీసుకుని రూ.25వేలతో ఎవరైనా సరే వస్త్ర దుకాణం ప్రారంభించవచ్చు. అదేంటి.. అంత చిన్న మొత్తం, చిన్న గది సరిపోతుందా.. అని అనుమానించాల్సిన పనిలేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టే సామర్థ్యం తక్కువగా ఉన్నవారు ఆ కొద్ది మొత్తంతోనూ వస్త్ర వ్యాపారం ప్రారంభించవచ్చు. అదే ఎక్కువ పెట్టుబడి పెట్టగలం అనుకుంటే.. షాపు సైజు పెంచి పెద్ద మొత్తాన్ని బిజినెస్‌లో పెట్టవచ్చు.
ఇక వస్త్ర దుకాణం అంటే అన్ని రకాల వస్త్రాలను విక్రయించాల్సి ఉంటుంది. అందుకు గాను హోల్‌సేల్ వ్యాపారులతో టై అప్ అవ్వాలి. ఇక హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో అలాంటి హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నప్పటికీ.. గుజరాత్‌లలోని సూరత్ మాత్రం ఇందుకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఉన్న అజ్మీరా ఫ్యాషన్స్ అనే హోల్‌సేల్ వస్త్ర దుకాణంలో లభించని దుస్తులు అంటూ ఉండవు. చిన్నారుల నుంచి పెద్దల వరకు, మహిళలు, పురుషులు.. ఇలా అన్ని వర్గాలకు, అందరికీ కావల్సిన దుస్తులు అక్కడ హోల్‌సేల్ ధరలకు లభిస్తాయి. కేవలం రూ.125 మొదలుకొని రూ.4వేల వరకు ధర ఉండే అనేక రకాల వస్త్రాల వెరైటీలు అక్కడ లభిస్తాయి.
మహిళలకు అవసరం అయ్యే చీరలు, వస్త్రాలు, బ్లౌజ్ మెటీరియల్స్, యువతులకు కుర్తీలు, లెహంగాలు, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లల దుస్తులు, పెద్దలకు సూట్స్.. ఇలా అన్ని రకాల వెరైటీలు అక్కడ చాలా తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు లభిస్తాయి. వాటిని అక్కడ హోల్‌సేల్ ధరలకు కొని చక్కని మార్జిన్‌తో మన దుకాణంలో అమ్ముకోవచ్చు. దాదాపుగా దుస్తులపై 25 నుంచి 50 శాతం వరకు మార్జిన్ వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున లాభం ఉంటుంది. అక్కడ దొరకని దుస్తులు అంటూ ఉండవు కనుక.. ఒక్కసారి అక్కడికి వెళ్లి వారితో టై అప్ అయి అక్కడి నుంచి దుస్తులను కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ అమ్మితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. సుదీర్ఘకాలం పాటు ఇలా వ్యాపారం చేస్తే.. ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున బట్టల షోరూంనే తెరవవచ్చు..!