హైదరాబాద్ లో భార్యను ముక్కలుగా నరికిన ఘటన దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే… తాజాగా భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో వెలుగులోకి మరో కొత్త కోణం వెలుగుచూసింది. శవాన్ని ముక్కలుగా చేసి మాయం చేయడం ఎలా? అనే విషయాలను ఓ క్రైమ్ వెబ్‌సిరీస్ చూసి నేర్చుకున్నాడట నిందితుడు గురుమూర్తి.
ముక్కలను కరిగించేందుకు అవసరమైన కెమికల్స్ గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్ లో చూసిన నిందితుడు., స్థానికులకు దుర్వాసన రాకుండా కెమికల్స్ వినియోగించాడని సమాచారం అందుతోంది. ఇక నేడు ఈ కేసు విషయమై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు. ప్రస్తుతం భార్యను ముక్కలుగా నరికిన ఆమె భర్త నిందితుడు గురుమూర్తి పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.