నిలిచిపోయిన రాధేశ్యామ్ షూటింగ్‌.. స్పాట్‌కి రాలేనంటున్న హీరోయిన్‌

-

ఈ కొవిడ్ ఇప్ప‌ట్లో దేన్నీ వ‌దిలేలా లేదు. ఇటు ప‌బ్లిక్‌, అటు బిజినెస్‌, ఇప్పుడు సినిమాల‌ను అతలాకుత‌లం చేస్తోంది. తేరుకున్నాం క‌దా అనుకునే లోపే మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మ‌రి కొన్ని షూటింగ్ వాయిదా వేస్తున్నాయి. షూటింగ్ స్పాట్ లోని న‌టీన‌టుల‌కు క‌రోనా రావ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్‌, ఆచార్య‌, స‌ర్కారువారి పాట లాంటి పెద్ద సినిమాలు వాయిదా ప‌డ్డాయి.


ఇప్పుడు అదే కోవ‌లోకి మ‌రో సినిమా వ‌చ్చి ప‌డింది. ప్రభాస్ హీరోగా డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఇంకా జ‌రుగుతూనే ఉంది. అప్పుడె్ప‌పుడో మొద‌లు పెట్టిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గతేడాది ఇటలీలో షూటింగ్ మొద‌లు పెట్టినా.. కరోనా రావడంతో షూటింగ్ కాస్తా లేట్ అయింది. మ‌రోవైపు సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో షూటింగ్ ఆలస్యం అవుతోందిన తెలుస్తోంది.
ఈ మూవీ కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఇందులో కొన్ని సీన్లు ప్రభాస్ కి నచ్చలేదని.. రీషూట్ చేశారిని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ప్యాచ్ వర్క్, పాటల షూటింగ్ వాయిదా వేశార‌ని స‌మాచారం. దీనికి కారణం.. హీరోయిన్ పూజాహెగ్డే షూటింగ్ కి రానని చెప్పింద‌ట‌. పూజాహెగ్డే ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో ఉంది. ఇప్పుడున్న కొవిడ్ పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని భావించిన ఈ ముద్దుగుమ్మ‌.. అదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్ప‌డంతో.. షూటింగ్ నిలిప‌వేశారంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version