చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు.. మీ డైట్ లో ఉన్నాయో లేదో చూసుకోండి

-

చలికాలంలో సాధారణంగా జలుబు, జ్వరం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కొందరికి జ్వరం తొందరగా తగ్గదు. అందుకే చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి.

సిట్రస్ ఫ్రూట్స్:

రోగనిరోధక శక్తి అనే మాట చెప్పగానే ఎవరికైనా సిట్రస్ ఫ్రూట్స్ గుర్తుకు వస్తాయి. ఉసిరి, జామ, నారింజ మొదలగు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజువారి డైట్ లో భాగం చేసుకుంటే మంచిది.

స్వీట్ పొటాటో:

తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఒక్కోచోట ఒక్కోరకంగా పిలుస్తారు. స్వీట్ పొటాటోలో బీటా కెరాటిన్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ ఏ అందుతుంది. విటమిన్ ఏ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పాలకూర:

పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి ఉంటుంది. అంతేకాదు.. ఇందులో ఉండే ఫోలేట్.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పసుపు:

భారతదేశపు ప్రతి ఇంటి వంట గదిలో పసుపు కచ్చితంగా ఉంటుంది. ఇందులో కర్క్యుమిన్ ఉండడంవల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరానికి ఆరోగ్యం అందుతుంది.

వెల్లుల్లి:

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగిన అల్లిసిన్ అనే పదార్థం వెల్లుల్లిలో పుష్కలంగా దొరుకుతుంది. వెల్లుల్లిని డైట్ లో భాగం చేసుకుంటే సాధారణ జలుబు దరిచేరకుండా ఉంటుంది.

క్యారెట్:

బీటా కెరాటేన్ అధికంగా గల క్యారెట్ ని రోజువారి ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version