లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ పై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ లైంగిక దాడి చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ పోలీసులు జాని ని గోవాలో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. అనంతరం సెప్టెంబర్ 20వ తేదీన ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు జానీ మాస్టర్. అయితే ఇప్పుడు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ద్వారా జానీ మాస్టర్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.