మేము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం : సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి రామనాయుడు పల్లిలో ప్రసంగించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం పెన్షన్లను రూ.3వేలు చేసింది. మేము అధికారంలోకి వచ్చాక వాటిని రూ.4వేలు పెంచినట్టు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్దగా పెన్షన్లు ఇవ్వడం లేదని తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది రూ.3లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్రం పై దాదాపు 10లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. ఒకవైపు అప్పులపై వడ్డీ కడుతూనే.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version