వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా

-

బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌ – సినీ నిర్మాత రీనా దత్తల కుమార్తె ఐరా ఖాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా తన ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను ఆమె పెళ్లి చేసుకుంది. ముంబయిలోని ఓ హోటల్లో ఈ జంట ఒక్కటైంది. రిజిస్టర్‌ మ్యారేజీతో ఐరా-నుపుర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

వీరి వివాహానికి ఆమిర్‌ ఖాన్‌, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్‌ రావు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ – నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. వివాహం అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ జరిగింది. ఐరా – నుపుర్‌ వివాహనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో నూతన జంట చాలా సింపుల్గా కనిపించడం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.

మరోవైపు నుపుర్ జాగింగ్ ఔట్ఫిట్ (వెస్ట్ అండ్ షార్ట్) ధరించి ముంబయి శాంటా క్రూజ్ నుంచి బాంద్రా పెళ్లి మండపానికి దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version