నిజాయితీ లేని వ్యక్తుల్ని తరిమికొట్టాల్సిన సమయం ఇదే – అమిత్ షా

-

బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను కోరారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. శనివారం ముస్తఫాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. ఆప్ పదేళ్లుగా అధికారంలో ఉందని.. ఇప్పుడు ఆ పార్టీ పాలన నుంచి ఢిల్లీని విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

నిజాయితీ లేని వ్యక్తులను తరిమికొట్టాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఈసారి మోదీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం స్కాం లు, మోసాలకు పాల్పడుతుందని, అనేకమంది అక్రమార్కులకు ఆశ్రయం ఇస్తుందని విమర్శించారు.

గత ఎన్నికలలో గెలిచిన 52 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు 26 మంది ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్లు ఇవ్వలేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఆ పార్టీ ఓడిపోతుందని వారికి తెలుసన్నారు. ఢిల్లీలో 3 జీ అంటే.. ( మోసపూరిత ప్రభుత్వం, అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించే ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం) నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని.. ఆ పార్టీని ఢిల్లీ నుండి చీపురుతో ఉడ్చివేస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version