మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. నేడు మురారీ మూవీ రీ రిలీజ్

-

టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా మొత్తం మహేశ్ బాబు బర్త్ డే విషెస్తో వెల్లువెత్తుతోంది. ఇక సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన మురారీని రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. రీ రిలీజ్కు ముందే అత్యంత వేగంగా రూ.కోటి వసూలు చేసిన సినిమాగా ‘మురారి’ రికార్డు క్రియేట్‌ చేసింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం ఇవాళ బిగ్ స్క్రీన్‌పై మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘మురారి’ మూవీకి తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version