BREAKING: నటుడు ఆర్‌. నారాయణమూర్తికి అస్వస్థత..!

-

Actor R. Narayanamurthy is ill: నటుడు ఆర్‌. నారాయణమూర్తికి అస్వస్థత నెలకొంది.ప్రముఖ నటుడిగా , నిర్మాతగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సామాజిక అంశాలపై దృష్టి పెడుతూ సమాజంలో జరిగే అన్యాయాలను ప్రతిఖండిస్తూ సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందుకే ఆర్ నారాయణ మూర్తి తెరకెక్కించే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు అతి చేరువలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

Actor R. Narayanamurthy, Tollywood

అయితే ఎంతగా సినిమాలు తెరకెక్కించినప్పటికీ ఆస్తిపరంగా మాత్రం ఈయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదట. అయితే.. అలాంటి… ఆర్ నారాయణ మూర్తికు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో నటుడు నారాయణమూర్తిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్ నారాయణ మూర్తికు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version